22 April, 2026 | 2:59 PM

Breaking News

చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం.. సంతాపం తెలిపిన కేంద్రమంత్రి   •   కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ విచారణ చేయించాలి.. కాంగ్రెస్ ఎంపీ చామల రెడ్డి   •   ఆర్టీసీ సమ్మెకు బిజెపి మద్దతు..   •   గ్రామంలో గుప్త నిధుల కలకలం   •   షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •  

11న అపెరల్ పార్క్‌లో యూనిట్ ప్రారంభం

10-04-2025 02:12 AM

హాజరుకానున్న నలుగురు మంత్రులు

సిరిసిల్ల, ఏప్రిల్ 9(విజయక్రాంతి): సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్క్ లో టెక్స్ పోర్ట్ యూనిట్ ను రాష్ట్ర మంత్రులు ప్రారంభించనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. ఈ సందర్భంగా అపెరల్ పార్క్ ను కలెక్టర్ బుధవారం పరిశీలించారు.

ఈ నెల 11వ తేదీన శుక్రవారం జిల్లా ఇన్చార్జి మంత్రి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆయా శాఖల మంత్రులు పార్కులోనే టెక్స్ పోర్ట్ యూనిట్ ను ప్రారంభిస్తారని వెల్లడించారు.

మంత్రుల రాక సందర్భంగా ఏర్పాట్లను కలెక్టర్ రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రారంభమనంతరం సభ నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. కావాల్సిన ఏర్పాట్లను రెవెన్యూ శాఖ అధికారులు, పోలీస్ శాఖ వారు బందోబస్తు ఇతర పనులను చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ రాధాబాయి, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిరిసిల్ల నాయబ్ తహశీల్దార్ విజయ్ భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.