16 March, 2026 | 6:43 PM

షెడ్యూల్ కులాల వారికి 210 యూనిట్లు

16-03-2026 05:34 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో 2026 27 ఆర్థిక సంవత్సరం గాను ప్రణాళికను ఖరారు చేసినట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 210 యూనిట్లకుగాను 199.02 లక్షల సబ్సిడీని వివిధ పథకాల రూపంలో లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. 50 వేల నుంచి పది లక్షల వరకు రుణ ప్రణాళికను ఖరారు చేసినట్టు తెలిపారు. ఇందులో స్వయం ఉపాధి వ్యవసాయరంగం పారిశ్రామిక రంగం వాహనాల రవాణా సోలార్ యూనిట్లు ఉన్నాయని తెలిపారు.

అరులైన ఎస్సీ కులాల చెందిన యువతీ యువకులు రైతులు ఈనెల 17 నుంచి 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకొని హాడ్ కాపీలను ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అందించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో రెండున్నర లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రెండు లక్షలు ఆదాయం ఉండి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎలాంటి రుణాలు పొందని వారు అర్హులని తెలిపారు. ఇతర వివరాలకు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం సంప్రదించాలని సూచించారు