27 May, 2026 | 12:28 AM

యూనివర్సిటీ అకాడమిక్ సేనేట్ సమావేశం

27-05-2026 12:00 AM

ఈ విద్యా సంవత్సరంలోనే ఫార్మసీ, లా కోర్సుల ప్రారంభం

నూతనంగా ఎంఏ ఉర్దూ, ఎంఈడి, ఎంపిఈడి కోర్సుల అనుమతికి ఉన్నత విద్యా మండలికి ప్రతిపాదనలు

నల్లగొండ టౌన్, మే 26: నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ అకాడమిక్ సెనెట్ సమావేశం మంగళవారం వర్సిటీ సమావేశం మందిరంలో నిర్వహించారు. యూనివర్సిటీ అభివృద్ధితో పాటు నూతన కోర్సులు, సిలబస్, బడ్జెట్, పీహెచ్డి నూతన రూల్స్ పలు అంశాలపై చర్చించారు.

ఈ సందర్బంగా వీసీ ప్రొ.ఖాజా అల్తఫ్ హుస్సేన్ మాట్లాడుతూ.. యూనివర్సిటీలో అత్యంత నాణ్యత ప్రమాణాలతో విద్యార్థులకు మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యభోధన సాగుతుందని తెలిపారు. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి విజయవంతంగా బయోమెట్రిక్ హాజరు అమలు, హాజరు ఆధారంగానే వర్సిటీ క్యాంపస్ కళాశాలలో చదివే విద్యార్థులకు పరీక్షల ఫీజుల అనుమతి, ఇతర అంశాలను అమలు చేస్తున్నామన్నారు. విద్యార్థుల సౌకర్యంకై నూతన హాస్టల్స్ నిర్మాణం, పరిపాలన భవనం నిర్మాణం ఇతర అంశాలను వెల్లడించారు.

ఈ విద్యా సంవత్సరం నుండి యూనివర్సిటీలో ఫార్మస్సీ, లా కళాశాలలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. యూనివర్సిటీ అభివృద్ధికై వర్సిటీ తొలత విశ్రాంత వీసీలు ప్రొ.గంగాధర్రావు, వీసీలు కట్టా నర్సింహారెడ్డి, భాగ్యనారాయణ మాట్లాడి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయా అంశాలపై చర్చ చేసి ఆమోదించారు. ఈ కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొ.కొప్పుల అంజిరెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ డా.వై.ప్రశాంతి, సీఓఈ డా.జి.ఉపేందర్రెడ్డి, వివిధ విభాగాల డీన్స్ ప్రొ.ఆకుల రవి, ప్రొ.అల్వాల రవి, రేఖ, అన్నపూర్ణబుట్టి, సెనెట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.