15 July, 2026 | 6:14 AM

లక్కు లాగి తంతే..

19-06-2024 12:05 AM

‘డార్లింగ్’ అంటూ పిలిచేవారు లేక బాధపడుతున్న ప్రియదర్శిని ‘జిందగి షేర్ ఆటో లెక్కుంటది బ్రదర్.. సీటె లేకున్నా అడ్జస్ట్ అయిపో బ్రదర్’ అంటూ ఓదారుస్తున్నారు చుట్టుపక్కల వారు. ఆ కథ ఏమిటన్నది తెరపై చూడాల్సిందే. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న తాజా చిత్రం ‘డార్లింగ్’. పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధించిన ‘హనుమాన్’ తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. చైతన్య సమర్పకురాలు.

విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియదర్శి, నభా నటేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి మంగళవారం ఫ్రస్టేటెడ్ సింగ్సిల్స్ యాంథమ్ అంటూ ‘ఖలాసే’ అనే గీతం విడదలైంది. దీనితో ఈ సినిమా సంగీత కార్యక్రమాలకు తెరలేపారు చిత్ర రూపకర్తలు. స్వరకర్త వివేక్ సాగర్ బాణీలందించిన ఈ పాటని సి.హెచ్.హనుమాన్‌తో కలిసి రామ్ మిరియాల పాడారు.

కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ గీతానికి విజయ్ పోలాకి సమకూర్చిన నృత్య రీతులతో ప్రేక్షకులతోనూ చిందేయించనున్నారు ప్రియదర్శి. బ్రహ్మానందం, విష్ణు, కృష్ణతేజ్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి డీవోపీ: నరేష్ రామదురై, ఎడిటర్: ప్రదీప్ ఇ రాఘవ, డైలాగ్స్: హేమంత్.