4 April, 2026 | 2:46 AM

దొడ్డి కొమరయ్య విగ్రహం ఆవిష్కరణ

04-04-2026 01:08 AM

తాడ్వాయి, ఏప్రిల్ 3 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో శుక్రవారం దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ప్రతినిధులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య అనగారిన వర్గాల కోసం నిరంతరంగా కృషి చేసిన గొప్ప నాయకుడు అని తెలిపారు ఆయన త్యాగం మరువలేనిది అన్నారు ఎంతో దీక్షతో పట్టుదలతో పోరాడిన మహనీయుడన్నారు.

తాడువాయిలో దొడ్డి కొమురయ్య విగ్రహం ఆవిష్కరణతో నిరంతరం ఆయన చేసిన పోరాటాలు గుర్తుకు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు భూమయ్య భూదాన్ నర్సింలు సంజీవులు సర్పంచ్ విజయ రాములు అంబీర్ శ్యాం రావు వెంకట్రామిరెడ్డి గంగారాం రనిల్ రెడ్డి గ్రామ పెద్దలు పాల్గొన్నారు.