రూ.2,000 వరకు యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు లేవు
15-09-2026 | 09:15am
యూపీఐ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.2,000 వరకు చేసే యూపీఐ(UPI) లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించకూడదని స్పష్టం చేసింది. ఇదే నిబంధన రూపే ఆధారిత డెబిట్ కార్డు చెల్లింపులకూ వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
రూ.2,000లోపు యూపీఐ, రూపే డెబిట్ కార్డు చెల్లింపులపై బ్యాంకులు, పేమెంట్ సంస్థలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి రుసుము వసూలు చేయకూడదని ప్రభుత్వం ఆదేశించింది. పంపేవారితో పాటు డబ్బు స్వీకరించే వారిపైనా ఈ నిబంధన వర్తిస్తుంది. వ్యక్తిగత యూపీఐ లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది.