ప్రిన్స్ బేకరీపై ఉప్పల్ జోన్ ఎస్‌ఓటీ పోలీసుల దాడి

16-09-2026 | 04:05am

ఘట్ కేసర్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): ఘట్ కేసర్ పట్టణంలోని ప్రిన్స్ బేకరీ(Prince Bakery)పై ఉప్పల్ జోన్ ఎస్‌ఓటి పోలీసులు(Uppal Zone SOT police) దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎం-ఫాస్ట్ ఉప్పల్ జోన్ ఎస్‌ఓటి పోలీసుల బృందం ఆహార కల్తీ, ఆహార భద్రతా ఉల్లంఘనలపై దృష్టి సారించి ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘట్కేసర్ పట్టణ కేంద్రం లో ఉన్న ప్రిన్స్ బేకరీపై మంగళవారం దాడి నిర్వహించింది.

దాడి సమయంలో బేకరీలో బేకరీ ఉత్పత్తుల తయారీలో గడువు ముగిసిన ఆహార రంగులు, గడువు ముగిసిన ఆ హార పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు, అలా గే బేకరీ పరిసరాలను అపరిశుభ్రంగా నిర్వహిస్తున్నట్లుగా గుర్తించినట్లు తెలిపారు. షేక్ నజీర్ బాషా (22) (సూపర్వైజర్) అదుపులో కి తీసుకున్నట్లు తెలిపారు. బేకరీ యజమాని షేక్‌అక్బర్ (35) విచారణ నిమిత్తం అందుబాటులో లేదన్నారు.

గడువు ముగిసిన బుష్ సింథటిక్ ఫుడ్ కలర్ 1 బాటిల్,కేక్ స్ప్రే రెయిన్ బో 11 బాటిల్స్, బుష్ రెడ్ కలర్ బా క్స్ 1 బాక్స్, గడువు ముగిసిన హార్ట్ చిల్లి 30 ప్యాకెట్లు, గ్లో బ్ ఐసింగ్ షుగర్ 1 ప్యాకెట్ (1 కిలో), క్రస్ట్ క్రంబ్ మాఫింన్ మిక్స్ పౌడర్ 1 ప్యాకెట్ (5 కిలోలు), హిందుస్థాన్ కోకోనట్ ఫ్లెక్స్ 5 ప్యాకెట్లు (5 కిలోలు), గుడ్లు 10 ట్రేలు, త్రిశూల్ సింథటిక్ ఫుడ్ కలర్ 12 బాటిల్స్, ఎగ్ పఫ్స్ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు, గడువు ముగిసిన బ్రెడ్, వనస్పతి,కలర్ మిస్ట్ 4, ట కిలో బరువున్న కేకులు 5, 1 కిలో బరువున్న కేకులు 5 లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

అదుపులోకి తీసుకున్న వ్యక్తిని, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఘట్కేసర్ పోలీస్ స్టేషన్కు అప్పగించడం జరిగిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఘట్కేసర్ పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు