26 February, 2026 | 6:59 AM

అగ్రకుల పెత్తందారులను అరెస్టు చేయాలి

26-02-2026 12:00 AM

ఎల్బీనగర్, ఫిబ్రవరి 25 : చిన్నారి మృతికి కారణమైన అగ్రకుల పెత్తందారులపై హత్య కేసు నమోదు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. కుమ్మెర జాతరలో రజక కుటుంబంపై దాడి చేసి, చిన్నారిని బలి తీసుకున్న అగ్రకుల పెత్తందారులను అరెస్టు చేయాలని వనస్థలిపురం రైతు బజార్ లో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఎం ఎల్బీనగర్ సర్కిల్ కార్యదర్శి ఆలేటి ఎల్లయ్య, రజక సంఘం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మల్లేశ్, సీపీఎం, రజక సంఘం నాయకులు ఏదుల గోవిందు. వరలక్ష్మి నిర్మమ్మ. కృష్ణమూర్తి, ప్రేమ్, భారతమ్మ, అద్దాల లక్ష్మమ్మ, చిన్న, కాశమ్మ, స్వరూప తదితరులు పాల్గొన్నారు.