26 February, 2026 | 1:19 AM

హక్కుల కోసం ఐక్యంగా ముందుకు వెళ్దాం

26-02-2026 12:00 AM

నిర్మల్, ఫిబ్రవరి24 (విజయక్రాంతి): బీసీల హక్కుల కోసం ఐక్యంగా ముందుకు వెళ్దామని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి అన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల ఎన్నికల్లో చైర్మన్గా ఎన్నికైన అప్పల కావ్య గణేష్ చక్రవర్తి దంపతులను సన్మానం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కృషి చేస్తుందని ఆయన తెలిపారు. బీసీలకు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌరవం పదవులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి సంఘ నాయకులు నర్సా గౌడ్ అనుముల భాస్కర్ తారక రఘువీర్ గోపి గోపీనాథ్ అడప పోశెట్టి తదితరులు ఉన్నారు.