calender_icon.png 25 November, 2025 | 3:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రచ్చ

25-11-2025 01:38:20 PM

కుర్చీల పైకి ఎక్కిన మజ్లిస్, బీజేపీ సభ్యులు

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో(GHMC Council meeting) రచ్చ జరిగింది. మజ్లిస్, బీజేపీ కార్పొరేటర్ల(BJP-AIMIM Corporator) మధ్య తోపులాట చోటుచేసుకుంది. వందేమాతరం, జయజయహే తెలంగాణ గీతాలాపన(Jaya Jayahe Telangana) సమయంలో ఎంఐఎం కార్పొరేటర్ కూర్చొనే ఉన్నారని, నిలబడకుండా అవమానించారంటూ బీజేపీ సభ్యుల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. మజ్లిస్, బీజేపీ సభ్యులు ఒకరినొకరు దూషించు కుంటూ కుర్చీల పైకి ఎక్కి నిరసన తెలిపారు. దీంతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Mayor Gadwal Vijayalakshmi) మార్షల్స్ ను రంగంలోకి దింపారు. కార్పొరేటర్లు టేబుల్స్ పైకి ఎక్కడం ఏమ్ మర్యాద అంటూ మేయర్ ఫైర్ అయ్యారు. ఆందోళన చేస్తున్న సభ్యులను బయటకు పంపిస్తానంటూ మేయర్ హెచ్చరించారు. కౌన్సిల్ సమావేశానికి అందరూ సహకరించాలని కోరారు.