calender_icon.png 25 November, 2025 | 2:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ ఎన్నికలపై కీలక ప్రకటన.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..?

25-11-2025 01:18:23 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు, నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మంగళవారం సాయంత్రం విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ అంశంపై ఇవాళ సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని మీడియా సమావేశం నిర్వహించనుంది.  రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 545 గ్రామీణ మండలాల్లోని 12,760 గ్రామ పంచాయతీలు, 1,13,534 వార్డుల్లో నోటిఫికేషన్ ఇవాళ జారీ కానుంది. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నాయి.