పార్టీని బలోపేతం చేసి సంక్షేమ పథకాలు అందేలా చూడండి
బోథ్, ఆగస్టు 3 ( విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి వెళ్లే విధంగా చూడాలని బోత్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ సూచించారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శిగా నియమించబడ్డ మల్యాల అంజయ్యను కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన అడ్డిగా ఆసన్నలను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని అయితే వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పన్నాల సురేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ లింభాజీ, వార్డు సభ్యులు గిరీష్, మహమ్మద్ కౌసర్ శంషుద్దీన్ తదితరులు ఉన్నారు.






