3 August, 2026 | 2:35 PM

పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశానికి మంత్రి తుమ్మలకు ఆహ్వానం

03-08-2026 01:32 PM

వేంసూరు మండల పామాయిల్ రైతులు, మంత్రితో ముఖాముఖి  

పామాయిల్ సాగు, ఫ్యాక్టరీ, గోదావరి జలాలపై రైతుల హర్షం

వేంసూరు ఆగస్టు 3 (విజయక్రాంతి): ఆగస్టు రెండో వారంలో మా మండల పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశానికి మీరు తప్పకుండా రావాలని ఆ మండల పామాయిల్ రైతులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆహ్వానించారు. దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం వేంసూరు మండల పరిధిలోని పామాయిల్ రైతులు, తుమ్మల అభిమానులు, సీనియర్ నాయకులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తమ ప్రాంత ప్రజలు కోరిన వెంటనే వేంసూరు వద్ద ఎగ్జిట్ ఏర్పాటు చేశారని, కల్లూరుగూడెం పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తికావచ్చిందని, అలాగే తమ పొలాలకు గోదావరి జలాలను అందించిన ఘనత మంత్రి తుమ్మలదేనని తెలిపారు. పామాయిల్ పంట సాగు ద్వారా తమ ప్రాంత రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొంటూ, ఆగస్టు రెండో వారంలో నిర్వహించే తమ మండల పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశానికి తప్పకుండా హాజరుకావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆహ్వానించారు.