అమీన్‌పూర్‌లో మాయ 'లేడీ' భారీ మోసం
చిట్టీల పేరుతో రూ.4 కోట్లు కాజేసి బోర్డు తిప్పేయటంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు
అమీన్ పూర్ ఆగస్టు 3: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ జీహెచ్ఎంసీ సర్కిల్(Ameenpur GHMC Circle) పరిధిలోని బిఎస్ఆర్ కాలనీలో నివాసముంటున్న చిలకలూరి పేటకు చెందిన శీరిష చిట్టిల వ్యాపారిగా అవతారమెత్తింది. చిట్టీలు, అధిక వడ్డీల పేరుతో నమ్మబలికి బాధితుల నుంచి విడతల వారీగా దాదాపు రూ.4 కోట్ల వరకు వసూలు చేసి అదృశ్యం అవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. బీఎస్ఆర్ కాలనీతో పాటు చుట్టుపక్కల స్థానికులను నమ్మించి వారి దగ్గర నుండి రూ.4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కాగా అకస్మాత్తుగా తనసొంత ఇల్లును అమ్ముకొని రాత్రికి రాత్రే ఉడాయించింది. దీంతో మోసపోయామని తెలిసిన బాధితులు అమీన్ పూర్ పోలీస్ స్టేషన్(Ameenpur Police Station)లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపులు చేపట్టారు.






