26 March, 2026 | 3:35 AM

ఇరాన్‌కు అమెరికా 15 షరతులు

26-03-2026 01:30 AM
  1. హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాలి
  2. ఇరాన్ ఇకపై ఎప్పటికీ అణ్వాయుధాలను అభివృద్ధి చేయొద్దు
  3. యురేనియం నిల్వలో 60 శాతాన్ని అప్పజెప్పాలన్న ట్రంప్
  4. కాల్పుల నిలిపివేత ప్లాన్‌ను ఇరాన్‌కు పంపిన అగ్రరాజ్యం

వాషింగ్టన్, మార్చి 25: అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం మరో కొత్త మలుపు తీసుకుంది. పశ్చిమాసియాలో భారీ సైనిక బలగాల పెంపునకు సిద్ధమవుతు న్న అమెరికా.. మరోవైపు పాకిస్థాన్ ద్వారా ఇరాన్‌కు పదిహేను కీలక ప్రతిపాదనలతో కూడిన ప్రణాళికను పంపింది. అమెరికా కొనసాగిస్తున్న ఈ దౌత్యపరమైన ప్రయత్నంతో ఇజ్రాయెల్ విస్మయానికి గురైనట్టు తెలుస్తోంది. 

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను నిలిపివేసే ప్రయత్నంలో భా గంగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇరాన్‌కు 15 సూత్రాలతో కూడి న వివరణాత్మక కాల్పుల విరమణ ప్రతిపాదనను పంపినట్లు తెలుస్తోంది. పలు అంత ర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈ ప్రణాళికను పాకిస్థాన్‌కు చెందిన మధ్యవర్తుల ద్వారా అందించారని తెలుస్తోంది.

వా షింగ్టన్, టెహ్రాన్ మధ్య కొత్త చర్చలకు ఆతిథ్యమిచ్చేందుకు కూడా పాకిస్థాన్ ముం దుకొచ్చింది. పశ్చిమాసియా ప్రాంతాల్లో ఇప్పటికే మోహరించిన సుమారు 50వేల మంది సిబ్బందికి తోడు మరో వెయ్యి మంది సైనికులను పంపేందుకు యూఎస్ సైన్యం సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ దౌత్యపరమైన చర్య చోటుచేసుకుంది. కాల్పుల విరమణ ప్రతిపాదనలతో పాటు 2 మెరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్లను కూడా పశ్చిమాసియాకు పంపుతోంది అమెరికా.

ఇవి సుమారు 5వేల మంది మెరైన్లు సహా వేల మంది సైనికులను తీసుకువస్తాయి. మరోవైపు.. ఇరాన్‌పై తమ సైనిక ఒత్తిడిని కొనసాగించాలని అమెరికాను పట్టుబడుతున్న ఇజ్రాయెల్‌కు అమెరికా చర్యలు తీవ్ర విస్మయానికి గురిచేస్తున్నాయి. ఈ రీతిలో వాషింగ్టన్ కాల్పుల విరమణ ప్రణాళికను ముందుకు తెస్తుందని ఇజ్రాయెల్ ఊహించలేదని మీడియా కథనాలు నివేదిస్తున్నాయి. ఈ కింద పేర్కొన్న పలు కీలక ప్రతిపాదనలతో కూడిన కాల్పుల విరమణ ప్రణాళికను ఇరాన్‌కు అమెరికా పంపినట్టు తెలుస్తుంది.

అమెరికా షరతులివే..

యుద్ధాన్ని ముగించేందుకు కఠినమైన షరతులను విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. అందులో యురేని యం శుద్ధిని నిలిపివేయడం, హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తిరిగి తెరవడం సహా అమె రికా, ఇజ్రాయెల్ ప్రకటించిన యుద్ధ లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా కీలక చర్యలు ఇందులో ఉన్నాయి.

* ఇరాన్ తన ప్రస్తుత అణు సామర్థ్యాలను విచ్ఛిన్నం చేయడం.

* ఇరాన్ ఇకపై ఎప్పటికీ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని హామీ ఇవ్వడం.

* ఇరాన్ భూభాగంలో యురేనియం సుసంపన్నం చేయడానికి అనుమతించకపోవడం.

* సుమారు 450 కిలోల యురేనియం నిల్వలో 60 శాతాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు అప్పగించడం.

* నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డోలోని అణు కేంద్రాలను కూల్చివేయాలి.

* ఇరాన్ వ్యాప్తంగా ఐఏఈఏకు పూర్తి పారదర్శకత కల్పించాలి. 

* ఇరాన్ తన ప్రాంతీయ మధ్యవర్తిత్వ కార్యకలాపాలను నిలిపివేయాలి. 

* మిత్రపక్ష మిలీషియాలకు మద్దతును నిలిపివేయాలి.

* హోర్ముజ్ జలసంధిని ప్రపంచవ్యాప్త రవాణాకు తెరిచి ఉంచాలి.

* ఇరాన్ క్షిపణి పరిధిని, పరిమాణాలను పరిమితం చేయాలి.

* భవిష్యత్తులో క్షిపణి వినియోగం కచ్చితంగా ఆత్మరక్షణకు మాత్రమే వినియో గించాలి.