దేశంలో స్థిరంగా ఇంధన భద్రత
- భారత్‌కు త్వరలో మరిన్ని నౌకలు వస్తాయి
- ప్రతిపక్ష పార్టీలకు కేంద్రం భరోసా
- రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్షం భేటీ
- యుద్ధంపై కేంద్రానిది మూగప్రేక్షక పాత్రన్న కాంగ్రెస్
న్యూఢిల్లీ, మార్చి 25: భారతదేశ ఇంధన భద్రత స్ధిరంగా ఉందని, అదనపు సరకుతో నౌకలు వస్తున్నాయని కేంద్ర అన్ని రాజకీయ పార్టీలకు భరోసా ఇచ్చింది. అమెరికా, -ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన సరఫరా లపై ప్రభావం చూపుతున్న ప్రపంచ ఉద్రి క్తతల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన అన్ని ఆందోళనలను కేం ద్రం పరిష్కరించిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
పశ్చిమ ఆసియా పరిస్థితిపై చర్చించ డానికి ప్రభుత్వం బుధవారం న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ ప్రాంగణంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్‌సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమా వేశానికి హోంమంత్రి అమిత్‌షా, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, పెట్రోలి యం మంత్రి హర్దీప్ పూరి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా, రాజీవ్ రంజన్ (లలన్) సింగ్‌తో పాటు ఇతర నాయకులు హాజరయ్యారు.
ఈ సమావేశం లో కాంగ్రెస్ నాయకులు ముకుల్‌వాస్నిక్, తారిఖ్ అన్వర్, సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్, సమాజ్వా దీ ఎంపీ ధర్మేంద్ర యాద వ్, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లా డుతూ, ఇంతటి కీలక తరుణంలో సమావే శం ఏర్పాటు చేయాలన్న చొరవను ప్రతిపక్ష నాయకులు అభినందించారని తెలిపారు.
చమురు, గ్యాస్ సరఫరా రావాణా మార్గాల్లో ఏర్పడే అంతరాయాలను ఎదుర్కోవడానికి భారత్ సన్నద్ధతతో సహా పలు కీలక అంశాల పై కేంద్ర ప్రభుత్వం సవివరమైన వివరణలు ఇచ్చిందని రిజిజు చెప్పారు. అన్ని పార్టీల నాయకులు, యుద్ధం, దాని ప్రభాంపై పరిస్థితి తీవ్రతను గుర్తించి, కేంద్ర ప్రభుత్వా నికి మద్దతుగా నిలుస్తామని చెప్పా యన్నా రు.
అయితే అఖిలపక్ష సమావేశంలో పాల్గొ న్న కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు తారిఖ్ అన్వర్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా- యుద్ధంలో పాకిస్థాన్ మధ్యవర్తి పాత్ర పోషి స్తుండగా, భారత్ మాత్రం ఇప్పటికీ మూగ ప్రేక్షక పాత్రకే పరిమితమైందని అన్వర్ సమావేశంలో ప్రస్తావించినట్లు సమాచారం. అన్వర్‌తో ఏకీభవించారు.
ఈ సమావేశంలో ప్రతిపక్ష పార్టీలు పలు ప్రశ్నలు లేవనెత్తాయని, ఈ ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ధిష్ట మైన, సంతృప్తికరమైన సమాధానాలు రాలేదని ఆయన తెలిపారు. పశ్చిమ ఆసి యాలోని పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో ప్రసంగించిన అనం తరం ఈ అఖిలపక్ష సమావేశం జరిగింది.




