31 July, 2026 | 8:21 PM

Breaking News

దమ్మపేట గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   ఎమ్మెల్యే చొరవతో బాలాజీ నగర్ ప్రమాదకర గుంతలో మట్టి నింపివేత   •   రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు   •   ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా ఖాజా భక్ష్   •   పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ ఎంఎల్ఏలు   •   కరీంనగర్‌లో ఘనంగా పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మానం   •   ఇల్లందుకు మరో ఆర్‌ఐని తక్షణమే నియమించాలి: పీడీఎస్‌యూ   •   నీట మునిగిన పంటలను పరిశీలించిన డీఏవో   •   మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన ఎంపీడీఓ   •  

గ్లోబల్ సుంకాలు 10% నుంచి 15% పెంపు

22-02-2026 01:43 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం

కొత్త సుంకాలు  అమలులోకి వస్తాయని స్పష్టీకరణ

ట్రంప్ నిర్ణయాలు చెల్లవని సుప్రీం కోర్టు ప్రకటించిన కొద్ది గంటలకే నిర్ణయం

అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కలకలం

వాషింగ్టన్, ఫిబ్రవరి ౨౧: ఇతర దేశాలపై సుంకాల విధింపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ విషయంలో స్వయంగా ఆ దేశపు అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ఆ నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చినప్పటికీ ట్రంప్ మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారు.

ప్రపంచ దేశాలపై విధించిన సుంకా లు చెల్లవని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన కొద్దిగంటల్లోనే, ఆయన సుంకాలపై దూకుడు నిర్ణ యం తీసుకున్నారు. ప్రపంచ దేశాలపై అమెరికా ప్రస్తుతం విధిస్తున్న గ్లోబల్ సుంకాన్ని 10% నుంచి ౧౫ % పెంచుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. సుంకం పెంపు అమలు తక్షణం అమలులోకి వస్తుందని శనివారం తన సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేశారు. సుప్రీం కోర్టు తీర్పును క్షుణ్నం గా సమీక్షించుకున్న తర్వాతే ఈ మేరకు నిర్ణయంత తీసుకున్నామని తేల్చిచెప్పారు.

ము న్ముందు చట్టబద్ధమైన సుంకాలను జారీ చేస్తామని స్పష్టం చేశారు. అన్ని దేశాలకూ ఆమో దయోగ్యమైన పద్ధతిలో తాము సుంకాలు విధిస్తుంటే, కొందరు పనిగట్టుకుని సు ప్రీంకోర్టును ఆశ్రయించడం విచారకరమని పేర్కొన్నారు. సుప్రీం తీర్పు ప్రకారం.. ట్రంప్ అధికారాలను ఉపయోగించి భారీగా సుంకాలు విధించడం చెల్లదు. అయినప్పటికీ, మరో చట్ట ంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని తన నిర్ణయాలను అమలు చేస్తున్నారు. కోర్టు తీర్పును పక్కన పెట్టి ట్రంప్ ముందుకు వెళ్తుండటంతో రాబోయే రోజుల్లో న్యాయపరమైన పోరాటం ముదిరే అవకాశం కనిపిస్తోంది.