31 July, 2026 | 9:01 PM

ఇల్లందుకు మరో ఆర్‌ఐని తక్షణమే నియమించాలి: పీడీఎస్‌యూ

31-07-2026 07:57 PM

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): ఇల్లందు తహసీల్దార్ కార్యాలయంలో పట్టణం, మండలానికి కలిపి ఒక్క రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) మాత్రమే విధులు నిర్వహిస్తుండటంతో ధ్రువీకరణ పత్రాల జారీ ఆలస్యమవుతూ విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి జె. గణేష్ తెలిపారు.

గతంలో ఇద్దరు ఆర్‌ఐలు పనిచేసేవారని, ప్రస్తుతం ఇద్దరికీ పదోన్నతులు రావడంతో ఒక్కరే విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో కుల, ఆదాయం, నివాసం తదితర ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందక విద్యార్థులు అడ్మిషన్లు, కౌన్సెలింగ్‌లలో ఇబ్బందులు పడుతున్నారని, రైతులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు కూడా కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం వెంటనే ఇల్లందుకు మరో ఆర్‌ఐ (ఆర్‌ఐ-2)ను నియమించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.