31 July, 2026 | 8:51 PM

మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన ఎంపీడీఓ

31-07-2026 07:51 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలోని పాత దాంరాజుపల్లి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మల్లాపూర్ ఎంపీడీఓ శ్రీకాంత్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, వారికి అందుతున్న ఆహారం నాణ్యత, రుచి, ఇతర సౌకర్యాలపై చిన్నారులను అడిగి తెలుసుకున్నారు.ఈకార్యక్రమంలో పాత దాంరాజుపల్లి గ్రామ సర్పంచ్ రోడ్ల రాజేశ్వరి, గ్రామ కార్యదర్శి సౌజన్య, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.