31 July, 2026 | 9:03 PM

నీట మునిగిన పంటలను పరిశీలించిన డీఏవో

31-07-2026 07:56 PM

పెంచికల్పేట్,(విజయ క్రాంతి): పెంచికల్పేట్ మండలంలో గురువారం రోజున ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షానికి పలు గ్రామాల్లోని పంటలు నీట మునిగాయి. ప్రధానంగా అగర్ గూడ, మోర్లిగూడ, కమ్మరగామ్ గ్రామాలలోని బొక్కి వాగు పెద్ద వాగు సమీపంలోని పంట చేనులో ఒక్కసారిగా తీవ్రమైన వరద నీరు చేరడంతో పంట పొలాలు చేనులు నీటమునుగాయి.

ఎల్డి నో ప్రభావంతో రైతులు బిక్కుబిక్కుమంటూ సాగు చేస్తున్న పంటలపై వర్షా దాడి జరిగేసరికి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం రోజున నీట మునిగిన పంటలను కొమరం భీం జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్ ఆధ్వర్యంలో ఇన్చార్జి మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అగరు కూడా సర్పంచ్ అల్లూరి రాజేశ్వరి రాజు ఏఈఓ వంశీ రైతులు పాల్గొన్నారు