29 July, 2026 | 2:37 PM

కేదార్‌నాథ్ ఆలయానికి చేరుకున్న ఉత్సవ్ డోలి

26-05-2024 06:19 PM

ఉత్తరాఖండ్ : కేదార్నాథ్  ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. మరోవైపు పంచముఖి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాంగా బాబా కేదార్నాథ్ యొక్క ఉత్సవ్ డోలి భారీ హిమపాతం మధ్య కేదార్నాథ్ ఆలయానికి చేరుకుంది. అటు పరమేశ్వరుడి నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగుతున్నాయి. ఈ నెల 10వ తేదిన ఆలయ ద్వారాలు తెరుచుకోగా.. ప్రారంభోత్సవం రోజునే రికార్డు స్థాయిలో 29 వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇక దర్శనం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.