రిజర్వేషన్లను తొలగించేందుకు మేం సిద్ధంగా లేము: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో చివరి దశ ఏడో విడత ఎన్నికలలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉత్తరప్రదేశ్ లో పర్యటించారు. మిర్జాపూర్, మౌ, డియోరియాలలో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్న ఆయన విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఇండియా కూటమి కులతత్వం, మతతత్వంతో కూరుకు పోయిందన్నారు. కూడమి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులుగా ఉంటారని, అలాంటి వారు దేశాన్ని ఎలా బలోపేతం చేస్తారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఎస్పీ ఓటు బ్యాంకు రాజకీయలకు పరిమితామని, మళ్లీ ఎన్డీయే కూటమిదే అధికారం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బిజెపి పార్టీని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. జరిగిన ఆరు దశల సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు బిజెపి వైపే మొగ్గు చూపారని చెప్పుకొచ్చారు. దేశంలో బిజెపి- ఎన్డీయే తుఫాన్ వీస్తోంది. దళితులు, వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం కష్టపడుతున్నమన్నారు.యూపీ ప్రజలు రాజకీయాలను అర్థం చేసుకున్నారు. రిజర్వేషన్లను తొలగించేందుకు మేం సిద్ధంగా లేము అని మోదీ తెల్చిజేప్పారు.






