ఏపీలో బాలికపై లైంగిక దాడి
వీడియో తీసి కుటుంబీకులను బెదిరించిన యువకులు
నలుగురి అరెస్టు
న్యూఢిల్లీ, మే 25: ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో 13 ఏళ్ల బాలికపై 15 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. బాలిక చదువుతున్న పాఠశాలలోనే మే 15న ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనను వీడియో తీసి రూ. 2 లక్షలు డబ్బులు ఇవ్వాలని బాలిక కుటుంబాన్ని బ్లాక్‌మెయిల్ చేసిన నలుగురిని అరెస్టు చేశారు. అంతకుముందే బాలుడిని అదుపులోకి తీసుకొని జువైనల్ హోమ్‌కు తరలించారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులు డబ్బులు డిమాండ్ చేస్తూ బాలిక కుటుంబాన్ని బెదిరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించగా, ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే అరెస్టు చేశారు. నిందితులను బాలసుబ్రహ్మణ్యం(22), చంద్రశేఖర్(22), తేజ(19), హరికృష్ణ(20)గా గుర్తించారు. వారిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.






