సాన్వి డబుల్ ధమాకా
19-05-2024 01:24 AM
హైదరాబాద్, ఖేల్ ప్రతినిధి: అండర్ ఆసియా టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన వీ సాన్వి రెడ్డి చాంపియన్‌గా నిలిచింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా జరిగిన టోర్నీలో బాలికల విభాగంలో వనపర్తికి చెందిన సాన్వి రెడ్డి టైటిల్ కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్లో సాన్వి రెడ్డి 7 6 తేడాతో సుమేరా అక్తర్ (బంగ్లాదేశ్)పై విజయం సాధించింది. బాలికల డబుల్స్ ఫైనల్లో సాన్వి రెడ్డి హుసేన్ జోడీ 7 6 హైదర్ హుమేర అక్తర్ జంటపై గెలిచింది. మరోవైపు సాన్వి రెడ్డి సోదరుడు తనీశ్ రెడ్డి అండర్ క్వార్టర్స్‌లో పరాజయం పాలయ్యాడు. అంతర్జాతీయ స్థాయిలో టైటిల్ గెలిచి శనివారం స్వదేశానికి వచ్చిన సాన్విరెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ జీ చిన్నారెడ్డి అభినందించారు.






