పశువులకు వ్యాధి నిరోధక టీకాల తప్పనిసరి
13-03-2026 03:14 PM
మండల పశు వైద్యాధికారి డాక్టర్ ప్రశాంత్ రెడ్డి
నంగునూరు,(విజయక్రాంతి): పశువులకు సోకే ప్రాణాంతక గాలి కుంటు వ్యాధిని అరికట్టేందుకు ముందస్తుగా వ్యాధి నిరోధక టీకాల వేయించుకోవాలని మండల పశు వైద్యాధికారి డాక్టర్ ప్రశాంత్ రెడ్డి అన్నారు.శుక్రవారం మండల పరిధిలోని రాంపూర్,వెంకటపూర్ గ్రామాల్లో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. పశువులకు సోకే ప్రాణాంతక గాలి కుంటు వ్యాధిని అరికట్టేందుకు ముందస్తుగా ఈ టీకాలు వేయించుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహిపాల్ రెడ్డి, నాయకులు సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




