14 బంతుల్లోనే 50
మళ్లీ బాదేసిన బుడ్డోడు
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
ముంబై, ఫిబ్రవరి 26: భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఐపీఎల్-2026 ఆరంభానికి ముందే తన బ్యాట్ పవర్ ఏమిటో ఇంకోసారి చాటిచెప్పాడు. డీవై పాటిల్ టీ20 కప్ 2026 టో ర్నీలో ఈ బిహారీ కుర్రోడు ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. డీవై పాటిల్ బ్లూ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వైభవ్ సూర్యవంశీ ఇండియన్ నావీ జట్టుపై చితక్కొట్టాడు. కేవ లం 14 బంతుల్లోనే అర్ద శతకం పూర్తి చేసుకున్న వైభవ్ మొత్తంగా 19 బంతుల్లో 63 పరుగులు చేశాడు.
వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. వరుణ్ చౌదరి బౌలింగ్‌లో ఒకే ఓవర్లో వైభ వ్ 20 పరుగులు బాదడం హైలెట్‌గా నిలిచింది. వైభవ్ సూర్యవంశీ ఫార్మాట్లకు అతీ తంగా విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు.
భారత్ అండర్-19 జట్టు తరఫున ఇటీవల వరల్డ్‌కప్ బరిలో దిగిన ఈ వైభవ్.. ఇంగ్లండ్‌తో ఫైనల్లో భారీ శతకం బాది భారత్‌కు టైటిల్ అందించాడు. ప్రస్తుతం డీవై పాటిల్ టీ20 కప్ టోర్నీతో బిజీగా ఉన్న వైభవ్.. తదుపరి ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలో దిగుతాడు. కాగా వైభవ్‌తో పాటు అర్జున్ టెండుల్కర్ సైతం అద్భుత అజేయ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. కేవలం 29 బంతుల్లోనే 55 పరు గులు సాధించాడు. వైభవ్, అర్జున్ ధనాధన్ దంచికొట్టడంతో డీవై పాటిల్ బ్లూ జట్టు ఇండియన్ నేవీ జట్టును ఐదు వికెట్ల తేడాతో ఓడించింది.




