27 February, 2026 | 4:27 AM

దంచికొట్టిన సఫారీలు

27-02-2026 12:00 AM

సౌతాఫ్రికా చేతిలో విండీస్ చిత్తు

మార్క్మ్,్ర డికాక్ మెరుపులు

సెమీస్ బెర్త్ దాదాపుగా ఖాయం

అహ్మదాబాద్, ఫిబ్రవరి 26 : టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా జట్టు సెమీఫైనల్‌కు చేరువైంది. వెస్టిండీతో జరిగిన మ్యాచ్ లో అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం కనబరిచిన సఫారీ టీం 9 వికెట్ల తేడాతో ఘనవిజ యం సాధించింది. బౌలింగ్‌లో పేసర్లు ఎం గిడి, రబాడ, బోస్చ్.. బ్యాటింగ్‌లో ఓపెనర్లు మార్క్మ్,్ర డికాక్ దుమ్మురేపారు. విండీస్ ఏ దశలోనూ పెద్దగా పోటీనివ్వలేకపోయిం ది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ ధాటిగా ఆడుతూనే వరుస వికెట్లు కోల్పోయింది.

కేవలం 83 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిందంటే సఫారీ బౌలర్లు ఏ విధంగా బౌలింగ్ చేసారో అర్థం చేసుకోవచ్చు. విండీస్ ఇన్నింగ్స్‌లో బ్రాండన్ కింగ్ (21), షై హోప్ (16) పరుగులకే ఔటవగా... మిగిలిన బ్యాటర్లంతా ఇలా వచ్చి అలా వెళ్లారు. హెట్ మెయిర్ 2, పావెల్ 9, ఛేజ్ 2, రూథర్ ఫర్డ్ 12, మాథ్యూ ఫోర్డ్ 11 పరుగుకే వెనుదిరిగారు. దీంతో కనీసం 100 పరుగులైనా చేస్తుందా అనుకుంటున్న దశలో జాసన్ హోల్డర్, రొమారియో షెఫర్డ్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. వీరిద్దరూ 8వ వికెట్ కు 89 పరుగుల ప్రపంచ రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

దీంతో వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల కు 176 పరుగులు చేసింది. హోల్డర్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 49, షెఫర్డ్ 37 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3, రబాడ 2, బోస్చ్ 2 వికెట్లు తీశారు. అహ్మదాబాద్ పిచ్ ఫ్లాట్ వికెట్ కావడంతో సౌతాఫ్రికా ఓపెనర్లు దం చికొట్టారు. డికాక్, మార్క్మ్ తొలి ఓవర్ నుంచే విధ్వంకర బ్యాటింగ్‌తో రెచ్చిపోయారు. స్టేడియం నలువైపులా భారీ షాట్ల తో అలరించారు. వీరిద్దరి జోరుతో సౌతాఫ్రికా పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 69 పరుగులు జోడించింది.

డికాక్, మార్క్ రమ్ తొలి వికెట్‌కు 8 ఓవర్లలో 95 పరుగులు పార్టనర్ షిప్ నెలకొల్పారు. డికాక్ 24 బం తుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 47 పరుగులకు ఔటవగా.. మార్క్ రమ్, రికెల్టన్ జట్టు విజయాన్ని పూర్తి చేశారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు అజేయంగా 82 పరుగులు జోడించారు. ఫలితంగా సౌతాఫ్రికా 16.1 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. మార్క్ రమ్ 46 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ విజయంతో సౌతాఫ్రికా దాదాపుగా సెమీస్ కు చేరినట్టే. అదే సమయంలో భారత్ కు ఊరట దక్కిం ది. టీమిండియా రన్ రేట్ తో సంబంధం లేకుండా మిలిగిన రెండు మ్యాచ్ లు గెలిస్తే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.