23 April, 2026 | 2:55 PM

Breaking News

నరేంద్ర మోదీపై మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై నిరసన   •   హైకోర్టు తీర్పుతో రేవంత్ రెడ్డి సర్కార్ కుట్రలు బట్టబయలు   •   గుర్వాయిగూడెంలో అక్రమంగా మట్టి తరలింపు.. జేసీబీతో సహా 8 ట్రాక్టర్లు సీజ్   •   Karnataka SSLC Result 2026 Out: కర్ణాటక SSLC ఫలితాలు విడుదల   •   బెంగాల్ ఎన్నికలు: 11 గంటల వరకు 41.11 శాతం పోలింగ్.. ముర్షిదాబాద్‌లో ఘర్షణలు   •   తమిళనాడులో 11 గంటల వరకు 37.56 శాతం పోలింగ్   •   ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చకపోతే... సచివాలయం ముట్టడిస్తాం   •   తెలంగాణ‌లో రెండోరోజు ఆర్టీసీ స‌మ్మె.. మెట్రోలకు పోటెత్తిన ప్రయాణికులు   •   భగీరథుని ప్రయత్నం చరిత్రలో మహత్తర ఘట్టం   •   ఆర్టీసీ సమ్మెకు బీజేపీ మద్దతు   •  

స్వార్థం కోసం విలువలు తాకట్టు

17-07-2024 12:05 AM

రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విలువలకు తిలోదకాలు ఇవ్వడం వల్ల ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు నమ్మకం లేకుండా పోతున్నది. తాజాగా పటాన్‌చెరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీనుంచి ఈ పార్టీలోకి చేరిన శాసనసభ్యుల సంఖ్య పదికి చేరినట్టు వార్తలు వచ్చాయి. ఇలాంటి పోకడలవల్ల ప్రజలకు పెద్దగా ఒరిగేది ఏముంటుందో వారికే తెలియాలి. ఒక పార్టీనుంచి మరో పార్టీలోకి ‘జంప్’ చేసే సంస్కృతిని పెంచి పోషించడం కేవలం వాళ్ల సొంత పనులకోసమే అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ ప్రభుత్వాన్ని కూలదోస్తారన్న భయంతోనే ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నట్టు కొందరు కాంగ్రెస్ పెద్దలు చెప్పడం తమను తాము తగ్గించుకున్నట్టుగానే భావించవలసి ఉంటుంది. 

-సాయితేజ, నాచారం, హైదరాబాద్