21 June, 2026 | 5:42 PM

సైదయ్యను పరామర్శించిన బడుగుల

21-06-2026 04:32 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలంలోని కల్మల్ చెరువు గ్రామానికి చెందిన నట్టె సైదయ్యను ఆదివారం మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ ససూర్యాపేటలోని అమ్మ హాస్పిటల్ లో పరామర్శించారు. ఇటీవల గోపాలపురం-రాయినిగూడెం మధ్య గల ఓ రైస్ మిల్లు వద్ద గాలికి కొట్టుకొచ్చిన ఐరన్ ఫ్రేమ్ రేకులు బలంగా తాకడంతో సైదయ్య రెండు కాళ్లు విరిగాయి.

ఈ విషయం తెలుసుకున్న  బడుగుల లింగయ్య యాదవ్ సైదయ్యను కలిసి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. సైదయ్యకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. సైదయ్యకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.  పరామర్శించిన వారిలో ఒకరికి హుజూర్ నగర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, నేరేడుచర్ల బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు  అరిబండి సురేష్ బాబు, మాజీ ఎంపీటీసీ ఎల్లబోయిన లింగయ్య, నాయకులు చిట్యాల శ్రీను, ప్రధాని వీరస్వామి, సతీష్, గోపాల్ ఉన్నారు.