21 June, 2026 | 5:42 PM

విద్యార్థులు యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి: ఎస్ఐ మోతిరామ్

21-06-2026 04:35 PM

రుద్రంగి,(విజయక్రాంతి): ప్రతి ఒక్కరు యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని రుద్రంగి ఎస్ఐ మోతిరామ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలోని కేజీబీవి పాఠశాలలో ఎస్ఐ ఆధ్వర్యంలో యోగ కార్యక్రమన్ని నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ యోగ చేయడం ద్వారా మానసిక శారీరక, ఆధ్యాత్మికంగా ఆరోగ్యాన్ని పెంపోందిస్తుందని,విద్యార్థులు యోగాను తమ దినచర్యలో భాగం చేసుకోవాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది,  ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.