29 June, 2026 | 2:02 AM

వడ్ల కుంభకోణంలో సంబంధం లేదన్న వ్యాన్‌డ్రైవర్ ప్రభాకర్

29-06-2026 12:00 AM

అసలు దోషుల పేర్లు త్వరలో బయటపెడతానని వెల్లడి

కోనరావుపేట, జూన్ 28 (విజయక్రాంతి): జిల్లాలో సంచలనం రేపుతున్న వడ్ల కుంభకోణం వ్యవహారం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం కోనరావుపేట మండలం మల్కపేటలోని శ్రీనివాస కల్యాణ మండపంలో బీఆర్‌ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన మీ డియా సమావేశంలో బాధితుడు, వ్యాన్ డ్రై వర్ బుట్టం ప్రభాకర్ తన వాదనను వినిపించారు. వడ్ల కుంభకోణంలో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా అన్యాయంగా తన వ్యాన్ను సీజ్ చేశారని ప్రభాకర్ ఆరోపించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బంది పిలవడంతోనే వడ్ల లోడు తరలించేందుకు వెళ్లానని, అక్కడ జరిగిన వ్యవహారాలపై తన కు ఎలాంటి అవగాహన లేదని స్పష్టం చేశా రు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తన వ్యాన్లో 467 వడ్ల బస్తాలను లోడ్ చేసి నిమ్మపల్లి ఏఎంసీ గోదాముకు పంపించారని తెలిపారు. అక్కడ అన్లోడ్ కాకపోవడంతో అపారెల్ పార్కుకు వెళ్లాలని సూచించారని, అందుకే అక్కడికి వెళ్లినట్లు వివరించారు.

అన్లోడింగ్ సమయంలో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కొత్త ట్రక్ షీట్ తీసుకువచ్చి, ముందుగా నమోదు చేసిన 467 బ స్తాల సంఖ్య నుంచి 89 బస్తాలను తగ్గిస్తూ కొత్త షీట్ అందించారని చెప్పారు. దీంతో తనకు అనుమానం వచ్చిందని పేర్కొన్నారు. తనపై కేసు వచ్చే అవకాశం ఉందనే భయం తో ఆ 89 బస్తాల వడ్లను గోదాం ఇన్ఛార్జ్ వేణుకు అప్పగించినట్లు తెలిపారు.

ఇదే సమయంలో మల్కపేట సర్పంచ్ బోయిని దేవ రాజు ఫోన్ చేసి ఆ బస్తాలను వాహనంలోనే ఉంచాలని, తాను గోదాం వద్దకు వస్తానని చెప్పినట్లు వెల్లడించారు. అనంతరం కొన్ని బస్తాలను గోదాంలో దించి, మిగిలిన బస్తాలను లారీలో లోడ్ చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు వివరించారు.తర్వాత మధ్యాహ్నం సమయంలో సీఐ ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కు రావాలని ఆదేశించారని, తన డీసీఎం వాహనంపై కేసు నమోదైనందున స్టేషన్లో ఉంచాలని సూచించినట్లు చెప్పారు.

ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరి కోసం సర్పంచ్ ప్రతిరోజూ పోలీస్ స్టేషన్కు వస్తున్నారని అన్నారు. ఈ కుంభకోణంలో అసలు దోషులు ఎవరో తమకు పూర్తిగా తెలుసని, త్వరలోనే వారి పేర్లను ప్ర జల ముందుకు తీసుకువస్తామని తెలిపారు. ప్రభాకర్ చేసిన ఈ వ్యాఖ్యలు జిల్లాలో వడ్ల కుంభకోణంపై రాజకీయ, సామాజిక వర్గా ల్లో మరింత చర్చకు దారితీశాయి.