29 June, 2026 | 2:01 AM

పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే విజయుడు

29-06-2026 12:00 AM

అలంపూర్, జూన్ 28: నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు ఎంతో మేలు చేస్తాయని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఆదివారం అలంపూర్ మండల కేంద్రం, ఇమాంపూర్లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి, ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో వ్యాధిని శాశ్వతంగా నివారించవచ్చని తెలిపారు.

ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, జయ రాములు వైస్ చైర్మన్, విక్రమ్, కౌన్సిలర్లు, ఆరోగ్యశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.అలాగే అలంపూర్, మానవపాడు, ఉండవల్లి, వడ్డేపల్లి, రాజోలి  మండల కేంద్రాలలో పాటు గ్రామాల్లో గ్రామ సర్పంచులు,  వైద్య సిబ్బంది , ఆశా కార్యకర్తల ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు.