వందేమాతరం శ్రీనివాస్ కొడుకు హీరోగా..
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందే మాతరం శ్రీనివాస్ కొడుడు సుస్వర తరంగ్ హీరోగా పరిచయం అవుతున్నారు. వీరేశ్ కోకా దర్శకత్వంలో సురవి విజ న్స్ బ్యానర్‌పై పీ చక్రధరరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. ఈ చిత్రంలో దివ్యాని మొండల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎస్ చంద్రశేఖరన్ డీవోపీగా, బిబిన్ అశోక్ సంగీత దర్శకుడిగా, నిరంజన్ దేవరమానే ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందు తున్న ఈ చిత్రం బుధవారం పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది.
డైరెక్టర్ డాలీ, గంటా రవితేజ, నల్లమలుపు బుజ్జి, వందేమాతరం శ్రీనివాస్ తదితర సినీ ప్రముఖులు, చిత్రబృందం ఈ వేడుకలో పాల్గొన్నారు. జూన్ 29 నుంచి షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. మూవీ లాంచింగ్ ఈవెంట్‌లో హీరో సుస్వర తరంగ్ మాట్లాడుతూ.. “నా తొలి సినిమాకే ఇంత మంచి అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాన’ని చెప్పారు. హీరోయిన్ దివ్యాని మాట్లాడుతూ.. “తెలుగులో ఇది నా తొలి సినిమా. తప్పకుండా అందరి ప్రేమ, ఆదరణ ఈ సినిమాకు ఉంటుందని ఆశిస్తున్నా” అని తెలిపారు. ‘ఇది నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్’ అని దర్శకుడు వీరేశ్ కోకా చెప్పారు.






