ఇట్స్ లైఫ్ బ్రో
కేఎం (కృష్ణమోహన్), పూజా సుందర్ శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇట్స్ లైఫ్ బ్రో’. కేఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సోమశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో కృష్ణమోహన్ సల్లగుండ్ల నిర్మిస్తున్నారు. ఇందులో రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, అంబటి శ్రీనివాస్, దేవిప్రసాద్, కిరీటి, త్రిశూల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రామిసింగ్ హీరో నితిన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. ‘నిజ జీవిత సంఘటనల ఆధా రంగా రూపొందుతున్న ఈ చిత్రం అందరి హృదయాలకు హత్తుకుంటుంది. వైవిధ్యమైన కథ, కథనాలతో తెరకెక్కుతున్న ఈ భావోద్వేగ ప్రేమకథ అందరికి తప్పకుండా నచ్చుతుందన్న నమ్మకం ఉంద’ని తెలిపారు. ఈ చిత్రానికి డీవోపీ: చైతన్య; సంగీతం: సాహిత్య సాగర్; ఎడిటర్: సత్య గిద్దుటూరి; కథ, స్క్రీన్‌ప్లే: ఇ రాజయ్య.






