10 March, 2026 | 10:28 AM

మహిళా అధికారులకు వాసవి క్లబ్ సన్మానం

10-03-2026 12:00 AM

ఎర్రుపాలెం మార్చి 9 (విజయక్రాంతి): ఎర్రపాలెం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఎరుపాలెం శాఖ వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఉదయం వివిధ శాఖల్లో పనిచేస్తున్న  మహిళా అధికారులను వారి కార్యాలయాల్లో ఫలం పుష్పం తోయంతో బహుమతులను ప్రధానం చేసి శాలవతో సత్కరించి అభినందనలు తెలిపారు.

స్థానిక మండల ఎమ్మార్వో ఉషా శారద, ఎం.పి.ఒ శ్రీలక్ష్మి విద్యుత్ శాఖ ఏఈ అనూష ,కస్తూరి భాయ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సునీత, స్థానిక వైద్యురాలు శ్రీలేఖ, స్థానిక డిసిసి బ్యాంక్ మేనేజర్ నీలం దివ్య, సేవలను కొనియాడి సత్కరించడం జరిగినది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన స్థానిక వాసవి క్లబ్స్ ప్రతినిధులు దూపుకుంట్ల పుల్లారావు దొడ్డ సంధ్య డివి అప్పారావు కేతపల్లి నరసింహారావు లను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్. ప్రోగ్రాం కోఆర్డినేటర్ కొప్పు పరమేశ్వరరావు అభినందనలు తెలిపారు.