26 April, 2026 | 6:15 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి

26-04-2026 04:40 PM

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు

సుల్తానాబాద్,(విజయ క్రాంతి): శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో  ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అమ్మవారిని వేడుకోవడం జరిగింది అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ ఆవరణలో గల శ్రీ వాసవి మాత దేవాలయంలో ఆదివారం జరిగిన వాసవి మాత జయంతి, వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న విజయ రమణారావు కు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ప్రభుత్వం తరఫున  అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విజయ రమణారావు మాట్లాడుతూ... తమ ప్రభుత్వం ఆర్యవైశ్యుల కు  అండగా ఉంటుందని అన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాసవి మాత జయంతి వేడుకలను ప్రభుత్వపరంగా నిర్వహించడం సంతోషించదగ్గ విషయం అన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు విజయ రమణారావు ను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో వాసవి మాత దేవాలయం చైర్మన్ చకిలం మారుతి, పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు  కొమురవెల్లి రామ్మూర్తి, అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్, ప్రధాన కార్యదర్శి తొడుపునూరి రాజేంద్రప్రసాద్, క్యాషియర్ కొమురవెల్లి (కేబి శ్రీనివాస్), నార్ల శ్రీనివాస్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షురాలు బాదం వాణి ఉమాశంకర్, శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణతో పాటు వాసవి క్లబ్, వాసవి వనిత క్వీన్స్ క్లబ్ ప్రతినిధులు, మునిసిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ కమిషనర్ తో పాటు  కౌన్సిలర్లు, నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అర్చకులు చంద్రశేఖర్ శర్మ, వల్లకొండ మఠం మహేష్ ఆధ్వర్యంలో పలువురు అర్చకులు అమ్మవారికి అభిషేకం, హోమాలు, కుంకుమ పూజలు, పల్లకి సేవ కార్యక్రమం వైభవంగా అంగరంగ వైభవంగా జరిగాయి.