26 April, 2026 | 6:19 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్

26-04-2026 04:36 PM

జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ

సత్తుపల్లి,(విజయక్రాంతి): డీజిల్ పెట్రోల్ కొరత వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యంగా రైతులు  వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతూ పెట్రోల్ బంకులు ముందుక్యూలు కడుతూ గంటల గంటలో రోజులు రోజులు పడిగాపులబడి ఇబ్బందులు పడుతున్నారని వెంటనే పెట్రోల్ డీజిల్ కొరత తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది.

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ మాట్లాడుతూ ట్రంపు మూర్ఖపు వైఖరి కారణంగా భారతదేశంపై యుద్ధ ప్రభావం పడి గ్యాస్ డీజిల్ పెట్రోల్ లేక ప్రజల ఇబ్బందులు పడుతున్నారని బ్లాక్లో వేలాది రూపాయలకు అమ్ముతున్నారని వీటిని అరికట్టి ప్రజా అవసరాలు దృష్టిలో ఉంచుకొని గ్యాస్ డీజిల్ పెట్రోల్ ప్రజలకు సరిపడా అందించి ఈ ఇబ్బంది నుండి కాపాడాలని దండు ఆదినారాయణ డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గ్యాస్ డీజిల్ పెట్రోల్ భారత్కు తీసుకురావడంలో విఫలమయ్యారని ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రజలకు కొరత లేకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు