28 June, 2026 | 5:39 PM

నాగర్‌కర్నూల్ జిల్లాలో వట్టెం వెంకన్న పల్లకి సేవ వైభవంగా నిర్వహణ

09-05-2026 04:14 PM

బిజినేపల్లి : నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పల్లకి సేవ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

నాగర్‌కర్నూల్ జిల్లా సహా తెలంగాణ తాజా వార్తల కోసం మా విజయక్రాంతి న్యూస్‌ హోమ్‌పేజ్‌ను సందర్శించండి.


శనివారం స్వామివారి పర్వదినం సందర్భంగా అల్మెల్ మంగ గోదాదేవి సమేతంగా పల్లకి సేవ నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, వివాహ కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

ఇలాంటి మరిన్ని నాగర్‌కర్నూల్ జిల్లా వార్తల కోసం మా నాగర్‌కర్నూల్ విభాగాన్ని చూడండి.

వట్టెం, పాలెం ప్రాంతాల ఆలయాల్లో జరిగిన ఈ కార్యక్రమాలకు భక్తులు విశేషంగా హాజరయ్యారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.