ఘనంగా ముగిసిన వీబీఎస్ చిల్డ్రన్ సమ్మర్ క్యాంప్
కోదాడ, ఏప్రిల్ 29 : పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో జరుగుతున్న విబిఎస్ సమ్మర్ చిల్డ్రన్ క్యాంప్ బుధవారం ముగిసింది. చిన్న పిల్లలు ఎండాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆరోగ్య విషయాలు చదువు పట్ల శ్రద్ధ పెద్దలపట్ల గౌరవం చదువుకోనవలసిన ఆవశ్యకత తల్లిదండ్రులను గురువులను సన్మా నించడం వంటి విషయాలు ఎన్నో నేర్పించారు.
బుధవారం కోదాడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ ఎర్నే ని బాబు మాట్లాడుతూ పిల్లలు రేపటి పౌరులని వారిని ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంచ డం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం అందుతుందని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన యేసయ్యను అభినందించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి, మాజీ క్రిస్టియన్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు వంటేపాక జానకి ఏసయ్య నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు గుండెపంగు రమేష్ పి ఆర్ టి యు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బొల్లికొండ కోటయ్య గిరిజన టీచర్స్ రాష్ట్ర నాయకులు జగ్గు నాయక్ కోదాడ పట్టణ ఎస్సీ సెల్ కాంగ్రెస్ నాయకులు రాంబాబు మైక్రో ఆర్టిస్ట్ ఏనుష్ తదితరులు పాల్గొన్నారు.






