21 May, 2026 | 3:17 AM

వేద పండితులు వేణుగోపాలచార్యులు గుండెపోటుతో మృతి

21-05-2026 01:52 AM

యాదగిరిగుట్ట, మే 20 :  యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన వేద పండితుడు వేణుగోపాల చార్యులు బుధవారం  గుండెపోటుతో మృతి చెందారు.  యాదగిరిగుట్ట దేవస్థానంలో వేద పండితునిగా ఉద్యోగం నిర్వహిస్తున్నారు. ఈ మధ్య బదిలీలలో   పాత గుట్టలో ఉద్యోగం నిర్వహిస్తున్నారు.

ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఉదయం పాత గుట్ట దేవస్థానానికి వెళ్లి తన కార్యక్రమాలు చేస్తూండగా  చాతిలో నొప్పి వస్తుందని తోటి ఉద్యోగస్తులకు తెలుపగా  వారు ఇంటి వద్ద కు తీసుకురాగా  వెంటనే నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతో ఇంటి సభ్యులు, తోటి సిబ్బందితో కలసి  హుటాహుటిన  భువనగిరి ఏరియా హాస్పిటల్ తరలించిగా డాక్టర్లు చూసి మృతి చెందినట్లు  నిర్ధారించినారు. వేణుగోపాలచార్యుడు  మృతి చెందడం  యాదగిరిగుట్ట దేవస్థానానికి తీరని లోటు అని ఆలయ ఈవో భవాని శంకర్ అన్నారు. దేవస్థాన సిబ్బంది వేణుగోపాలచార్యులు మృతదేహానికి నివాళులర్పించారు.