స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
21-05-2026 01:51 AM
కేసముద్రం, మే 20 (విజయక్రాంతి): కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన గద్దల ప్రభాకర్ ఇటీవల అకాల మరణం చెందగా వారి కుటుంబానికి కేసముద్రం జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల 1987 88 ఎస్ ఎస్ సీ బ్యాచ్ స్నేహితులు అండగా నిలిచారు. గద్దల ప్రభాకర్ కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితులు, ముగ్గురు ఆడపిల్లలు కావడంతో ప్రభాకర్ చిన్ననాటి స్నేహితులు 18,500 ప్రభాకర్ భార్య సునీతకు అందజేశారు.
అలాగే వారి స్నేహితులు ఎల్లవేళల ప్రభాకర్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. కష్టకాలంలో తోడుగా ఉన్న ప్రభాకర్ స్నేహితులకు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ సీ పూర్వ విద్యార్థులు రాపాక వెంకట్ నారాయణ, కోమటిరెడ్డి పిచ్చిరెడ్డి, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.






