యువతకు జీవనోపాధి కల్పించడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం
21-05-2026 01:54 AM
బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు చిర్ర సాంబమూర్తి
వేములపల్లి మే 20 : యువతకు జీవనోపాధి కల్పించడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యమని బిజెపి జిల్లా కౌన్సిల్ సభ్యులు చిర్ర సాంబమూర్తి అన్నారు. బుధవారం ప్రధానమంత్రి విశ్వకర్మ యువజన ద్వారా కుట్టు మిషన్లకు అప్లై చేసినవారికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన కుట్టుమిషన్లను లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. మారుమూల పల్లెల్లోకి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుతున్నా యని మోడీ పరిపాలనలో లబ్ధిదారులకు అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. మోదీ పాలనలోనే దేశం సురక్షితంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు పెదమం భరత్, కందాటి రమేష్ వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.






