1 July, 2026 | 11:18 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

వృక్షారోపణకు సేవ చేస్తున్న వెంకన్నకు పూర్వ కలెక్టర్ నుంచి సహాయం

21-03-2026 05:07 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణ పరిధిలోని శ్రీనివాస గుట్ట వద్ద వృక్షారోపణకు విశేషంగా కృషి చేస్తున్న పిట్టల వెంకన్నకి, పూర్వ జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ బదిలీపై వెళ్లే సందర్భంలో తమ సొంత నిధుల నుంచి రూ.10,000/- ఆర్థిక సహాయం అందించారు. ఆ మొత్తాన్ని శుక్రవారం పిట్టల వెంకన్న  అందజేశారు.

పాండురంగపురం గ్రామానికి చెందిన పిట్టల వెంకన్న  పాల్వంచలోని శ్రీనివాస గుట్టపై భక్తులకు సేవగా అనేక వృక్షాలను నాటి సంరక్షిస్తున్నారు. గుట్టకు వచ్చే భక్తులకు మొక్కలు అందించేందుకు నర్సరీ ఏర్పాటు చేయాలని ఆయన సంకల్పించారు. ఈ నర్సరీ ఏర్పాటుకు అవసరమైన మొక్కల కొనుగోలు, పెంపకం, తోటపని పరికరాలు, కొమ్మల ద్వారా పెంచే మొక్కలు కోసం ప్రోత్సాహకంగా ఈ సహాయం అందజేశారు.