4 June, 2026 | 6:51 PM

కృష్ణసాగర్ గ్రామ సమస్యలపై ఎమ్మెల్యేకు వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేత

04-06-2026 05:42 PM

బూర్గంపాడు,జూన్4(విజయక్రాంతి): బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ గ్రామపంచాయతీ పరిధిలో నెలకొన్న పలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రామ సర్పంచ్ తాటి వాణి,ఉప సర్పంచ్ భూక్య మోహన్ రావు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుని గురువారం మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలు, అభివృద్ధి పనులు, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ తదితర ప్రజా సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు పదం రాజు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.