విజయ్ సినిమా ప్రారంభం
స్టార్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ (ఎస్‌వీసీ) ఓ కొత్త సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం శనివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ‘రాజా వారు రాణి గారు’ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న రవికిరణ్ కోలా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఎస్‌వీసీ సంస్థలో వస్తున్న 59వ సినిమా ఇది. ఇందులో విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా, మరో నిర్మాత నిరంజన్‌రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
దర్శకుడు హను రాఘవపూడి ఫస్ట్‌షాట్ డైరెక్షన్ చేశారు. రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా ఈ నెల 16 నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది. కొద్ది రోజులుగా ‘వీడీ14’గా ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి ‘రౌడీ జనార్ధన’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి డీవోపీ: అనంద్ సీ చంద్రన్; ప్రొడక్షన్ డిజైన్: డినో శంకర్; నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్; రచన, దర్శకత్వం: రవికిరణ్ కోలా.






