మోగ్లీ వచ్చేది అప్పుడే
12-10-2025 01:14 AM
రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ 2025’. ‘కలర్ ఫోటో’ చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న యూనిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా సినిమా ఇది. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. నిర్మాతలు శనివారం సినిమా విడుదల తేదీని ప్రకటించారు. డిసెంబర్ 12న థియేటర్ల లోకి వస్తుందని వెల్లడించారు.
ఈ చిత్రంలో సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్. బండి సరోజ్‌కుమార్ ఒక బలమైన విలన్ పాత్రను పోషిస్తుండగా, హర్ష చెముడు మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: కాల భైరవ; డీవోపీ: రామ మారుతి ఎం; ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్; ఆర్ట్: కిరణ్ మామిడి.






