‘మన మాణిక్యాలు’ ఉపయుక్తం
04-06-2024 12:05 AM
‘మన మాణిక్యాలు’ శీర్షిక తెలంగాణ ప్రాచీన కవులు, రచయితల జీవిత విశేషాలను ‘ఎడిట్’ పేజీలో సీరియల్‌గా అందిస్తున్నందుకు ‘విజయక్రాంతి’ సంపాదకులకు, యాజమాన్యానికి, రచయిత గన్నమరాజు గిరిజా మనోహరబాబుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. గుణాఢ్యుని నుంచి మొదలుకొని హాలుడు, మల్లియ రేచన, వేములవాడ భీమన్న, పాల్కురికి సోమన్న, గోన బుద్ధారెడ్డి వరకు అన్ని వ్యాసాలను సేకరించి పెట్టుకున్నాం. తెలుగు సాహిత్యంలో పోటీ పరీక్షలకు ఇవి మాకెంతో ఉపయుక్తంగా ఉంటాయి.
-విమలారాణి, ప్రజ్ఞాపూర్






