ప్రమోషన్లలో న్యాయం కావాలి!
తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఎస్‌సీ గురుకులంలో తప్ప మిగిలిన ఏ గురుకులంలో కూడా ప్రిన్సిపాల్ పోస్టు ‘సెలక్షన్ పోస్ట్’ కాదు. ఇక్కడ మాత్రమే 1:3 చొప్పున సీనియర్స్‌ను ఇంటర్వ్యూలకు పిలి చి, సెలక్షన్స్ రూపేనా కొందరిని ఎంపిక చేస్తున్నారు. ఎంపిక కాని ఉపాధ్యాయులకు ‘ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీములు’ కూడా వర్తింప చేయడం లేదు. ఒక్క ఎస్సి గురుకులంలో మినహా, మిగిలిన ఏ సొసైటీలోనూ ఇలా సీనియర్స్‌ను కాదని జూనియర్స్‌కు ప్రమోషన్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇంటర్వ్యూల పేరుతో ఇష్టం వచ్చిన వారిని సెలెక్ట్ చేయడం అసంబద్ధం. సీనియర్స్ ఎంతో మానసిక క్షోభకు గురవుతున్నారు. ఇటీవలి కొత్త జీవో ప్రకారం ఏ సెలక్షన్ కమిటీలోనూ ఇంటర్వ్యూస్ ఉండడానికి వీల్లేదు. కనుక, దీనిని యాజమాన్యం విధిగా అమలు చేయాలి. సర్వీసు రూల్స్ మార్పు చేసి ‘ప్రిన్సిపాల్ గ్రేడ్ 2’ ప్రమోషన్స్ కేవలం సీనియార్టీ ప్రాతిపదికన మాత్రమే ఇవ్వాలి. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించాలని సీరియర్స్ కోరుతున్నారు.
-రావుల రాజేశం, హైదరాబాద్






