24 March, 2026 | 1:07 PM

వికసిత్ భారత్‌లో భాగస్వాములు కావాలి

22-09-2024 02:44 AM

బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అంజికుమార్‌రెడ్డి

నిర్మల్, సెప్టెంబర్ 21(విజయక్రాంతి): ప్రధాని మోదీ న్యాయకత్వంలో వికసిత్ భారత్‌లో యువకులు, మేధావులు భాగస్వాము లు కావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజికుమార్‌రెడ్డి, లక్ష్మణ చందా మాజీ ఎంపీపీ అడ్వాల పద్మారమేష్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో బీజేపీ సభ్యత్వ నమోదును ప్రారంభించి మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీని బలోపేతం  చేస్తామని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు పార్టీకోసం కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.