calender_icon.png 11 September, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెన్నెల నగర్ పేదల సమస్యలు పరిష్కరించాలి

22-09-2024 02:45:33 AM

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 21(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 36వ వార్డు వెన్నెల నగర్ నిరుపేదల సమస్యలు పరిష్కరించాలని సేవ్ కొత్తగూడెం, సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్ కోరారు. శనివారం కాలనీవాసులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట వంటావార్పు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం 75గజాల చొప్పున స్థలం అప్పగించి చేతులు దులుపుకున్నదని, వారి సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాగునీరు, విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ పథకంలో ఎలాంటి నిబంధనలు లేకుండా ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేసేలా పాలకవర్గం తీర్మానం చేయాలన్నారు.